Monday, May 18, 2026
Homeహైదరాబాద్‌Awards | వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు.

Awards | వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు.

  • రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం

జూన్ 13న వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రధానంచేస్తున్నట్టు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం వెల్లడించింది. పెద్దపట్ల భారత్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్, కడపల్ల సోమేశ్వర్ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్ మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జూన్ 13, 2026న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు సంఘ నాయకులు తెలిపారు.

- Advertisement -

రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు, సంఘ పెద్దలు హాజరుకానున్నారు. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, శాసనసభ్యులు, విద్యావేత్తలు కూడా పాల్గొననున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో 525కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, అలాగే సీబీఎస్ లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు అర్హులని తెలిపారు.

రాష్ట్రంలోని అర్హులైన వీరశైవ లింగాయత్ లింగ బలిజ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కల్లపల్లి రాచప్ప, పట్లోళ్ల శివశరణ్, శెట్టి శివకుమార్, కాల్వ మల్లికార్జున్ అప్పా, మధుసుధన్, విద్యుల్లత, అశ్విని, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News