Saturday, May 16, 2026
Homeమహబూబ్‌నగర్‌Donation | ఆలయ అభివృద్ధికి హైదరాబాద్ భక్తుడి సహకారం

Donation | ఆలయ అభివృద్ధికి హైదరాబాద్ భక్తుడి సహకారం

స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి ఆ అంజన్న ఆశీర్వాదంతో ఓ భక్తుడు దాతగా ముందుకు రావడం శుభపరిణామం అని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

అంజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఫ్లోరింగ్ వర్క్ కోసం కీర్తిశేషులు పట్వారి వెంకటయ్య గారి కుమారుడు,బాలకృష్ణ సహకారంతో వారి స్నేహితుడు సుఖీ గ్రూప్ యజమానులు K శ్రీనివాసులు మరియు వారి కుమారుడు K సంతోష్ అంజన్న ఆలయ అభివృద్ధికి గ్రానైట్ ని అందించారు.వీటి విలువ సుమారు 5,33,500/- (ఐదు లక్షలా ముప్పై మూడు వేల ఐదువందలు).

- Advertisement -

ఈ సంధర్బంగా దాతలను శాలువాతో సన్మానించి, వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన అంజన్న ఆలయ కమిటీ సభ్యులు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News