Homeకెరీర్ న్యూస్AI | అందరి దిశ దశను మార్చే ఏ ఐ..

AI | అందరి దిశ దశను మార్చే ఏ ఐ..

  • కొన్ని ఇంపార్టెంట్ కోర్సులు మీకోసం..

మనిషి సృష్టించిన ఏఐ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. ఏం చేయాలన్నా ఏఐ ఉందిగా అని ప్రతి నోట వింటున్న మాట. దినదినాభివృద్ధి చెందుతున్న ఏఐ అందరి దిశ మారుస్తుంది. విద్యార్థుల చూపు కూడా ఏఐ చదువులపై పడుతుంది. 2026 నాటికి ఐటీ రంగంలో సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఐటీ నిపుణులు తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే అత్యుత్తమ ఏఐ కోర్సుల వివరాలు..

2026లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ కెరీర్‌లో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్ ఒకటి. ఇది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో ప్రత్యేకమైనది. వీరు సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లలా కాకుండా నేరుగా కస్టమర్ లేదా క్లయింట్ ఆఫీసుల్లో ఉండి వారి వ్యాపార సమస్యలను అర్థం చేసుకుని అక్కడికక్కడే కోడింగ్ చేసి, టెక్నాలజీ సొల్యూషన్స్ అమలు చేస్తారు. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, పలంటిర్, డేటాబ్రిక్స్, సర్వం ఏఐ, టీసీఎస్ వంటి సంస్థలు తమ ఏఐ నెట్‌వర్క్‌లను విస్తురిస్తున్నాయి. దీంతో ఈ ఎఫ్ డీ ఈ లకు డిమాండ్ పెరిగింది.

- Advertisement -

ఆర్ ఏ జీ, ఏఐ లీడ్ అనేవి ఏఐలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అధునాతన భావనలు. ఇవి ఏఐ మోడల్స్ ఆలోచించే, సమాధానం ఇచ్చే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆర్ ఏ జీ అనేది ఏఐ మోడల్స్‌కు తమ సొంత డేటా కాకుండా బయట ఉండే నిర్దిష్ట సమాచారం నుంచి సమాధానాలు వెతికి చెప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది.

ఏఐ ఎవాల్యూషన్ ఇంజినీర్.. ఇది ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సామర్థ్యం, కచ్చితత్వం, భాషా నైపుణ్యాన్ని పరిశీలించి మెరుగుపరిచే ఒక కీలకమైన ఉద్యోగం. ఏఐ మోడల్‌ను తయారు చేయడం ఒక ఎత్తు అయితే, అది ఎంతవరకు కచ్చితత్వంతో పనిచేస్తుందో పరీక్షించడం మరొక ఎత్తు. ఏఐ వ్యవస్థలు నమ్మదగినవిగా, సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్ధారించడానికి ఈ నిపుణులు అవసరం. వీరు సరికొత్త టెస్టింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌లను సృష్టించి ఏఐ సిస్టమ్‌ల నాణ్యతను నిరంతరం పరీక్షిస్తారు. తప్పులను గుర్తించి ప్రొడక్షన్‌ దశలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తారు.

కాంటెక్స్ట్ ఇంజినీర్..ఇప్పటివరకు ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌ గురించి విన్నాం. కానీ అంతకు మించి కాంటెక్స్ట్‌ ఇంజినీరింగ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఏఐ, ఎల్‌ఎల్‌ఎమ్‌లో సరైన సమాచారాన్ని, సరైన సమయంలో, సరైన పద్ధతిలో అందించే ప్రక్రియనే కాంటెక్స్ట్‌ ఇంజినీరింగ్‌ అంటారు.

సీనియర్ లీడ్ క్వాలిటీ ఇంజినీర్.. సాధారణ సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ కేవలం బగ్స్‌ను గుర్తించడానికే పరిమితమవుతుంది. కానీ ఏఐ క్వాలిటీ ఇంజినీరింగ్‌ పరిధి చాలా పెద్దది. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా నడిచే సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే కీలకమైప పాత్ర. ఈ ఇంజినీర్లు ఏఐ సిస్టమ్స్‌ కచ్చితత్వం, సురక్షితత, పనితీరును వివిధ పద్ధతుల ద్వారా పరీక్షిస్తారు.

ఏఐ రెడ్ టీమ్ ఇంజినీర్.. ఇది ఒక అధునాతన సైబర్‌ సెక్యూరిటీ భద్రత. ఏఐ వాడకం పెరిగే కొద్దీ సైబర్‌ భద్రతా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ సిస్టమ్‌లను హ్యాకర్ల బారిన పడకుండా కాపాడటమే వీరి విధి. హ్యాకర్లు ఆలోచించే విధంగా ఆలోచించి ఏఐ, ఎల్‌ఎల్‌ఎమ్‌లోని లొసుగులను కనిపెట్టడం వీరి బాధ్యత.

ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్..అనేక ఏఐ టెక్నాలజీని నైతికంగా, పక్షపాతం లేకుండా, సురక్షితంగా అభివృద్ధి చేయడానికి పనిచేయడమే ఈ నిపుణుల పాత్ర. నియామకాలు, ఆరోగ్యం, ఫైనాన్స్‌, విద్య, ప్రభుత్వ సేవల్లో ఏఐ వాడకం పెరగడంతో అవి పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నైతికంగా పనిచేసేలా చూడటం అత్యంత కీలకం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News