Homeస్పోర్ట్స్FIFA Controversy | ఫిఫా వరల్డ్ కప్ లో వివాదాస్పదం..

FIFA Controversy | ఫిఫా వరల్డ్ కప్ లో వివాదాస్పదం..

  • అర్జెంటీనా ప్లేయర్ల బ్యానర్స్ ప్రదర్శణ ..
  • తీవ్ర దుమారం రేపిన వ్యవహారం..

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు వివాదాస్ప రీతిలో బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో గెలిచిన త‌ర్వాత అర్జెంటీనా ఆట‌గాళ్లు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. అయితే మైదానంలోనే ఆ ప్లేయ‌ర్లు ఓ బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఫాక్‌ల్యాండ్స్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే రీతిలో ఉన్న బ్యాన‌ర్‌ను ఆట‌గాళ్లు ప‌ట్టుకున్నారు. దీనిపై వివాదం చెల‌రేగింది. లాస్ మాల్వినాస్ స‌న్ అర్జెంటీనాస్ అని బ్యాన‌ర్‌లో రాసింది. అర్జెంటీనాకే ఫాక్‌ల్యాండ్స్ చెందుతాయ‌న్న అర్థం వ‌చ్చే రీతిలో బ్యాన‌ర్ ఉన్న‌ది. అట్లాంటిక్ స‌ముద్రంలో ఉన్న ఫాక్‌ల్యాండ్స్ దీవులు ఒక‌ప్పుడు బ్రిట‌న్ ఆధీనంలో ఉన్నాయి.

అయితే ఆ దీవులు త‌మ‌కే చెందుతాయ‌ని అర్జెంటీనా పోరాడుతోంది. ఈ నేప‌థ్యంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు .. బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించ‌డం వివాదానికి దారి తీసింది. ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు రాజ‌కీయ సంకేతాలు ఇవ్వ‌డం స‌రికాదు అని అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. 1982లో ఈ రెండు దేశాల మ‌ధ్య ఆ దీవుల కోసం యుద్ధం కూడా జ‌రిగింది. ఆ యుద్ధంలో వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. 2014లో అర్జెంటీనా ప్లేయ‌ర్లు ఇలాగే ఓ వివాదాస్ప‌ద బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. అప్పుడు ఆ జ‌ట్టుకు 20 వేల పౌండ్లు జ‌రిమానా వేశారు. అయితే తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న ప‌ట్ల ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఫిఫా అధికారులు చెబుతున్నారు. ఆట‌గాళ్లు నియమావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News