- మానవత్వం చూపిన కుటుంబసభ్యులు..
శుక్రవారం రాత్రి చనిపోయిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు నేత్రదానంచేశారు.. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం లోని నం .2 ఇంక్లైన్కు చెందిన రాసకట్ల శ్రీనివాస్ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న 6వ వార్డు కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి రజిత కుటుంబ సభ్యులకు నేత్రదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పుట్టెడు దుఃఖంలోనూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ రాసకట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నిషన్ ప్రదీప్ సేవలను కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి రజిత ప్రత్యేకంగా అభినందించారు.
“నేత్రదానం మహాదానం” అనే సందేశాన్ని సమాజంలో మరింత విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని 6వ వార్డు కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి రజిత పిలుపునిచ్చారు.

