- సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్.
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాంతంలో బుధవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులను గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తుల్జా ప్రసాద్, గ్రామ పంచాయితీ సిబ్బంది, ఉపాధి హామీ కార్మికులు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -
