జవహర్ నగర్ పరిధిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మేకల అయ్యప్ప, మాజీ కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా నాయకత్వం వహించారు. జె. దేవేందర్ రెడ్డి, నరిశెట్టి కిరణ్ కుమార్, రెడ్డిశెట్టి మహేష్ గుప్తా, జనరల్ సెక్రటరీ జమాల్పూర్ నవీన్ కుమార్, కోట్ల చెన్నారెడ్డి, రంగ శ్రీమన్నారాయణ, గుండ బిక్షపతి, సింగారం సంతోష్ గౌడ్, సుధాకర్ గౌడ్, పూజారి రాజు, కోట శ్రీనాథ్, సింగన్న బాలరాజు, రెడ్డిశెట్టి పాండురంగం, నరేష్ గురుస్వామి, సిద్ధేశ్వర గురుస్వామి, బూడిద వెంకటేష్, బోయినపల్లి నరసింహ, శ్రీశైలం గురుస్వామి, రాజశేఖర్, రాజశేఖర్ చారి కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.
స్వామివారి సేవలో సదాచారి గురుస్వామి భజన బృందం ప్రత్యేక భజనలు నిర్వహించింది. రమేష్, మల్కారం రమేష్, పీవీఎం బ్రదర్స్, రేషన్ షాప్ అశోక్ సేట్, సుడి మహేందర్, యానం కృష్ణ, సింగారం అనిల్ గౌడ్, కొండలు ముదిరాజ్, కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు.
