- తీవ్రంగా ఖండించిన ఎగ్గే మల్లేశం మాజీ ఎమ్మెల్సీ
కురుమ సంఘం పై కొంత మంది చేస్తున్న అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం పేర్కొన్నారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఖ్యామ మల్లేష్ తో కలిసి ఆయనమాట్లాడుతూ,తాను రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడుగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన 18 ఏళ్లలో ఆలయాల వద్ద వసతి గృహాలు, విద్యార్థి హాస్టళ్లు తదితర నిర్మాణాలతో సంఘానికి సుమారు రూ.2000 కోట్ల విలువైన ఆస్తులు ఏర్పాటు చేయడం జరిగిందనితెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు కురుమ సంఘం ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించడం సరైంది కాదని హెచ్చరించారు. సంఘం అభ్యున్నతి కోసం పారదర్శకంగా పనిచేస్తున్నామని, ట్రస్ట్ బోర్డు పర్యవేక్షణలో లెక్కలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఎవరికైనా సందేహాలు ఉంటే కార్యాలయానికి వచ్చి వివరాలు పరిశీలించవచ్చన్నారు. ముస్లింజంగ్ వంతెన వద్ద భవనం నిర్మాణానికి తాను రూ.50 లక్షలు, చీటీల ద్వారా రూ.40 లక్షలు సమీకరించామని, ప్రస్తుతం ఆ భవనం నుంచి అద్దె వస్తోందని తెలిపారు. యాదాద్రి, కొమురవెల్లి ప్రాంతాల్లో దాతల సహకారంతో వసతి గృహాలు నిర్మించామని చెప్పారు. మన్సూరాబాద్‌లో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టి, కోకాపేటలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కురుమల కోసం భవనం నిర్మాణం పూర్తి చేశామని వివరించారు.
భవిష్యత్తులో భవనాలను అద్దెకు ఇచ్చి వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కురుమ సంఘ భవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లే, చీర శ్రీకాంత్ ఎగ్గే మల్లేశం నాయకత్వాన్ని అభినందించారు. సంఘ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను ఖండించారు. ఈ సమావేశంలో బండారి నారాయణ, కొలుపుల నరసింహ, తూముకుంట అరుణ్ కుమార్, రెక్కల కొండల రాజ్, కె శ్రీనివాస్, బాలమని, విజయలక్ష్మి, మిర్యాల విజయ తదితరులు పాల్గొన్నారు.
