- గాంధీ మైదానంలో ఏర్పాట్లకు సిద్ధం..
బిహార్‌లో సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా అనంతరం సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి సామ్రాట్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్ డిప్యూటీ సీఎంలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గత నెలలోనే బీజేపీ, జేడీయూ ఆధ్వర్యంలో ఎన్‌డీయూ కూటమి నుంచి ప్రభుత్వ ఏర్పాటు పూర్తికాగా, ఇప్పుడు మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మే 7, గురువారం మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లు తెలుస్తోంది.
మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం బిహార్ రాజధాని పాట్నాలోని ప్రఖ్యాత గాంధీ మైదాన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి, ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు కేటాయిస్తారు అనే ఆసక్తి నెలకొంది. నిబంధనల ప్రకారం బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రితో కలిసి 36 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. బీజేపీకి 12 మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. అలాగే, కూటమిలో కీలక పార్టీ అయిన జేడీయూకు 11 మంత్రి పదవులు, రామ్ విలాస్‌కు చెందిన ఎల్‌జేపీకి 2 పదవులు, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎం పార్టీలకు చెరో మంత్రి పదవికి అవకాశం ఉంది.
