- తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
అంతరాలు లేని సమాజం కోసం మానవీయ కోణంలో ప్రజా ప్రభుత్వం పాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల వేతనాల నుండి పది శాతం తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం ప్రభుత్వం మానవీయ కోణంలో ఒక భాగం అని అన్నారు.
రాజకీయాలకతీతంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాయని ప్రజా సంక్షేమ పథకాలపై అర్హులైన వారికి అవగాహన లేదని సంక్షేమ పథకాల అభివృద్ధి పనుల అమలుపై ఎప్పటికప్పుడు అధికారులు అవగాహన కల్పించడంతో ఫలితాలు వస్తున్నాయని. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం డ్వాక్రా సంఘాలకు అందిస్తున్న రుణాలను మహిళలంతా వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణలో సంక్షేమ పాలన :
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ పాలన నడుస్తుంటే కళ్ళు ఉండి చూడలేని కబోదులు అవాకులు చివాకులు పేలుతున్నారని నిన్న మొన్న పురుడు పోసుకున్న ఒక పార్టీ నాయకులు రేవంత్ ప్రభుత్వం హిట్లర్ ప్రభుత్వం ఇలా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
కుట్టు మిషన్ల పంపిణీలో మరో మానవీయ కోణం :
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు ( మహిళలకు(బిసి) ఆర్థిక స్వయం ప్రతిపత్తిని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుందని దీనిని మానవీయ కోణంలో చూడాలని నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలలో పైలెట్ ప్రాజెక్టుగా ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీ అమలకు రంగం సిద్ధం చేస్తుందని ఈ పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1000 మంది మహిళలను ఎంపిక చేసి కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నామని అన్నారు.
రాష్ట్రం మొత్తంలో ఈ పథకం ద్వారా ఒకటి పాయింట్ 19 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు బీసీ ఆర్థిక సహకార సంస్థ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించిందని గుర్తు చేశారు ఈ పథకం అమలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అర్హత ప్రమాణాలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని బీసీ కార్పొరేషన్ ఎండికి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు..
బీసీ మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి వారికి నైపుణ్యం కలిగించేందుకు కుట్టుపనివారీగా మార్చడానికి ఈ ఆటోమేటిక్ కుట్టుమిషన్లు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. బలహీన వర్గాల మహిళలకు స్వయం సమృద్ధి గల పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బీసీ మహిళల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.
