కవిత ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని, లేకపోతే ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండా పార్టీ నమోదు దరఖాస్తును మూసివేస్తామని సీఈసీ స్పష్టం చేసింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, అదే పేరును కొనసాగించడం సాధ్యం కాదని పేర్కొంటూ కవితకు ఎన్నికల సంఘం లేఖ పంపింది.
- Advertisement -
