- సొంతంగా 5 లక్షలు అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
- ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేత.
ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఎమ్మెల్యే తరపున వారి సోదరుడు అజయ్ రెడ్డి వారి కుటుంబానికి నేడు సంబంధిత నగదును అందించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేశారు.
కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ భాస్కర్, రాష్ట్ర యువ నాయకులు పడిదల నవీన్ రావు,మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్ వీణ విజేందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, పట్టణ కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,నల్లబెల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్,నర్సంపేట మండల ఉపాధ్యక్షులు గజ్జిరాజు, మధు,రాజు, నల్లబెల్లి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్, పట్టణ నాయకులు మండల నాయకులు రాము, గాని శ్రీనివాస్,గిరిగాని రమేష్, జిజ్జుల కార్తీక్, ఆర్టీసీ ఉద్యోగులు రూపిక సుమన్, కే రంగయ్య, మోహన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
