- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కార్యాలయ పరిశీలన..
- కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 నిర్వహణను పర్యవేక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, భద్రత, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకున్న చర్యలను ఆయన స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ NTA కంట్రోల్ రూమ్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను పరిశీలించారు.
సుమారు 23 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ భారీ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్, కేంద్రాలతో సమన్వయం, సాంకేతిక మౌలిక సదుపాయాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, “పరీక్షా నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా వ్యవహరించాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రాధాన్యత,” అని పేర్కొన్నారు.
