కష్టజీవి కుటుంబం నుంచి ప్రజల మనిషిగా ఎదిగిన
డా. గడదాసు వెంకటేశ్వర్లు పేదరికం నుంచి ప్రజా నాయకుడిగా ఎదుగుదల.. స్వార్థ రాజకీయాల మధ్య నిస్వార్థ సేవకుడిగా గుర్తింపు..
గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాల కల్పనకు అవిరాళంగా కృషిచేసిన మానవతా మూర్తి..
నిష్కళంకమైన ఆయన జీవన ప్రయాణం ప్రజాసంక్షేమానికై సాగుతోంది..
- విద్యతో సామాజిక మార్పు లక్ష్యంగా ముందుకు
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
- విపత్తుల సమయంలో సేవా కార్యక్రమాలు
- విద్యార్థుల విద్యకు ప్రోత్సాహం, సహాయం
- నిష్కళంక, విలువల రాజకీయాలకు ప్రతినిధి
అచ్చంపేట పుడమి పులకరిస్తోంది.. విన్నూత్న సేవా కార్యక్రమాలతో దూసుకు వస్తున్న ఓ సంచలన యువ నాయకుడి రాకకోసం వేయికన్నులతో ఎదురుచూస్తోంది.. ఇప్పటికే ప్రజలతో మమేకమవుతూ ఎన్నెన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మనసులను దోచుకున్న డా. గడదాసు వెంకటేశ్వర్లు మరింత సేవలు అందించడానికి సన్నద్ధం అవుతున్నారు.. అద్భుతమైన విషయం ఏమిటంటే.. ఉన్నతమైన చదువులు ఆయనకు ఆభరణాలుగా మారాయి.. సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఆయన్ను ప్రజాసేవవైపు నడిపించింది.. తన పరిధిలో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూనే, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
లోక్ సత్తా పార్టీనుంచి ప్రజా క్షేత్రంలో పోటీచేశారు.. ఎన్నో పదవులు ఆయనకు అలంకార ప్రాయంగా నిలిచాయి.. కేవలం విద్య మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలదని నమ్మిన వ్యక్తి.. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాల కల్పనకు అవిరాళంగా కృషిచేసిన మానవతా మÖర్తి.. నిష్కళంకమైన ఆయన జీవన ప్రయాణం ప్రజాసంక్షేమానికై సాగుతోంది.. ఈ క్రమంలో ఆయన ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంది.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక స్థాయికి చేరుకొని మరింతగా ప్రజాసేవ చేయాలన్నదే ఆయన ఆకాంక్ష.. ప్రజాసంక్షేమ కాంక్షతో, తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన భవిష్యత్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం సృష్టించనున్నారు అన్నది యదార్ధం..


అచ్చంపేట నియో జకవర్గంలో డా. గడదాసు వెంకటేశ్వర్లు రాక ఒక రాజకీయ ప్రభంజనంలా మారింది. ఆయన కేవలం ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఒక భరోసాగా అవతరించారు. కటిక పేదరికం, కఠినమైన వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. అట్టడుగు వర్గాల వెతలను స్వయంగా అనుభవించిన వ్యక్తిగా, వారి గొంతుకగా నిలుస్తున్నారు.
కేవలం పదవుల కోసం కాకుండా, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఉద్యమించిన చరిత్ర ఆయనది. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ, ప్రజలతో విడదీయలేని పేగు బంధాన్ని పెనవేసుకున్న నిబద్ధత గల నేత. “విద్యే ఆయుధం ` సామాజిక మార్పే లక్ష్యం” అని నమ్మిన విద్యావేత్త. అజ్ఞానాన్ని పారద్రోలి, అక్షర జ్ఞానంతోనే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమని విశ్వసిస్తూ యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా, ఉడిమిల్ల గ్రామంలో వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించిన ఆయన జీవన ప్రయాణం స్వయంకృషి, సహనశీలత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైన విశ్వాసాన్ని, అంతులేని నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. అణగారిన వర్గాలను సాధికారిత చేయడం.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం ద్వారా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు సమాన అభివృద్ధిని అందించే న్యాయమైన సమాజాన్ని నిర్మించడం అనే సంకల్పాన్ని ఆయన తనకు తాను సంకల్పించుకున్నాడు..


కాగా ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్, ఉపాధ్యక్షుడిగా.. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్య క్షుడిగా.. జాయింట్ యాక్షన్ కమిటీ సమన్వయకర్తగా.. అసోసి యేషన్ తెలంగాణ టెక్నికల్ ఎంప్లాsTÖస్ మాజీ ప్రధాన కార్యదర్శిగా.. హైదరాబాద్ వికాస్ టెక్నో స్కూల్, కల్వకుర్తి, డైరెక్టర్ గా విలువైన సేవలు అందించారు..
అంతే కాకుండా మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఉస్మానియా యÖనివర్సిటీ కేంద్రంగా క్రియాశీల నాయకత్వం వహించారు.. 2009లో మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాలలో వరద బాధితుల కోసం సహాయ శిబిరాల నిర్వహణ చేపట్టారు.. ఉడిమిల్ల గ్రామంలో అగ్నిప్రమాద బాధితులకు పరిహారం కోసం పోరాటం సలిపారు.. కరోనా మహమ్మారి కాలంలో అణగారిన వర్గాల ప్రజలకు ఉచిత నిత్యావసర సరుకులను పంపిణి చేశారు..
పేద, అనాథ విద్యార్థులకు ఉచిత విద్యా సహాయం చేశారు.. నల్లమల్ల అచ్చంపేట ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యకోసం ప్రేరణ కల్పిస్తూ వారికి మెటీరియల్ పంపిణీ చేశారు.. మహాత్మా జ్యోతిరావు పూలె, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం క్రియాశీలకంగా పనిచేశారు.. అలాగే యురేనియం తవ్వకాలకు వ్యతిరేక ఉద్యమాలు, నల్లమల ప్రాంత సంరక్షణ ఉద్యమాల్లో తనవంతుగా భాగస్వామ్యం అయ్యారు..
పిహెచ్ డి (మెకానికల్ ఇంజినీరింగ్) ఉస్మానియా విశ్వవిద్యాలయం (పీహెచ్ డి. ప్రయోగాత్మక పరిశోధన కార్యాచరణ (డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ హైదరాబాద్).. ఎం.ఈ (ప్రొడక్షన్ ఇంజనీరింగ్) ఉస్మానియా యÖనివర్సిటీ.. బి.ఈ. (మెకానికల్ ఇంజినీరింగ్) ఉస్మానియా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి.. కాగా విద్య సామాజిక మార్చుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం అన్న నమ్మకం ఆయనకు దృఢంగా ఉంది.
2000 నుంచి ఇప్పటివరకు ఉన్మానియా విశ్వవిద్యాలయంలో సహాయ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.. యÖజీ, పీజీ స్థాయిలో వేలాది మంది విద్యార్థులకు బోధనతో బాటు మార్గదర్శకత్వం వహించారు.. ఇంజినీరింగ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, మెకాట్రానిక్స్, సీఏడీ / సీఏఎంలో నైపుణ్యం సాధించారు..
ఆయనకున్న ప్రధానమైన ప్లస్ పాయింట్స్.. ప్రజలతో బలంగా మమేకం అవడం.. నిష్కళంకమైన, విలువలతో కూడిన ప్రజా జీవితం గడపడం.. విద్య ఆధారిత అభివృద్ధి దృక్పథం అని చెప్పవచ్చు.. వివిధ సంస్థల్లో ఆయన నాయకత్వ పఠిమ నిరూపించుకున్నారు.. గ్రామీణ ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ విద్యా అవకాశాల కల్పనకు ఎంతగానో సహకారం అందించారు.. గ్రామీణ విద్యార్థులు, కుటుంబాలకు కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన వైద్య సేవల సహాయం చేశారు..
రాజకీయాల్లో స్వార్ధం పేరుకుపోయిన ప్రస్తుత తరుణంలో విద్యావంతుడు, సమాజ సేవకు అంకితమైన నాయకుల అవసరం ఎంతైనా వుంది.. నిస్వార్ధ సేవా తత్పరత వంటబట్టించున్న డా. వెంకటేశ్వర్లు లాంటి నాయకులు ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన తరుణం ఆసన్నమైంది.. ప్రజా హితం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న యువరక్తం సమÖలంగా రాజకీయాల్లోని కుళ్ళును ప్రక్షాళన చేయాల్సిన క్షణాలు ఆసన్నమైయ్యాయని రాజకీయ మేధావులు, విశ్లేషకులు సూచిస్తున్నారు.. మహోన్నతమైన వ్యక్తులను ఎన్నుకోవాల్సి బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉందని వారు బలంగా వాదిస్తున్నారు..
