Sunday, May 3, 2026
HomeసినిమాGopichand34 | గోపీచంద్34 అనౌన్స్‌మెంట్, రేపు పూజా కార్యక్రమం

Gopichand34 | గోపీచంద్34 అనౌన్స్‌మెంట్, రేపు పూజా కార్యక్రమం

హీరో టీ గోపీచంద్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ‘భరత వర్ష’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్న ఆయన, ఇప్పుడు తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ వివెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. వినూత్న కథలతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి సినిమాలు చేయడంలో పేరుగాంచిన ఈ బ్యానర్, మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాజెక్ట్‌ను తీసుకువస్తోంది.

- Advertisement -

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కనిపించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అగ్ని వర్ణంలో ఆకాశం, సూర్యుడు, ఒక కొండపై గర్వంగా నిలబడి ఉన్న నల్ల పాంథర్.. ఇవన్నీ కలిసి సినిమా టోన్‌ను ఇంటెన్స్, మైథికల్‌గా చూపిస్తున్నాయి. ఈ చిత్రం పూజా కార్యక్రమం రేపు జరగనుందని మేకర్స్ ప్రకటించారు.

యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఇప్పటికే మంచి పేరు సంపాదించినవి వెంకట్, ఈ సినిమాకు ఎపిక్ యాక్షన్ కథను సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని షాందత్ ISC అందిస్తుండగా, సంగీతాన్ని సామ్ సి ఎస్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ఆర్ట్ డైరెక్షన్‌ను రామకృష్ణ–మోనిక నిర్వహిస్తున్నారు.

నటీనటులు: టీ గోపీచంద్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వి వెంకట్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్
డీఓపీ: షాందత్ ISC
సంగీతం: సామ్ సి ఎస్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ–మోనిక
పిఆర్ఓ: వంశీ-శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News