Saturday, May 2, 2026
Homeభక్తిVengamamba | శ్రీవారిని భర్తగా భావించిన వెంగమాంబ..

Vengamamba | శ్రీవారిని భర్తగా భావించిన వెంగమాంబ..

  • ఆయన సేవలో తరించిన భక్తశిరోమణి..
  • తరిగొండ వెంగమాంబ చరిత్ర అజరామరం..

భక్తి మార్గంలో పయనించి భగంతుని సాక్షాత్కారం పొందిన భక్త శిరోమణుల చరిత్రలు తరాలు గడిచినా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి, తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తురాలు, వేంకటాచల మాహాత్మ్యము, ద్విపద భాగవతం వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించి భక్తి సాగరంలో అమృత బిందువుగా నిలిచిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పరమ భక్తురాలు శ్రీ తరిగొండ వెంగమాంబ

తరిగొండ వెంగమాంబ వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు చిత్తూరు జిల్లాలో ఉన్న తరిగొండ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణయ్యమాత్యుడు, మంగమాంబ. ఈ ఏడాది ఏప్రిల్ 30, గురువారం వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా ఈ రోజునే తరిగొండ వెంగమాంబ జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

- Advertisement -

వెంగమాంబకు చిన్నతనం నుంచే భక్తి భావాలు ఎక్కువ. బాల్యం నుంచే ఆటపాటల కంటే దైవ చింతనలోనే అధిక సమయం గడిపేవారు. తండ్రి వద్దే ప్రాథమిక విద్యను అభ్యసించిన వెంగమాంబ, అనతి కాలంలోనే కవిత్వంలో అత్యున్నత ప్రావీణ్యం సంపాదించారు.

వెంగమాంబకు చిన్నతనంలోనే చిత్తూరు జిల్లా నారాయణవనానికి చెందిన వేంకటాచలపతితో వివాహం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు వివాహం జరిగిన కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆ కాలంలో పాతుకుపోయి ఉన్న మూఢనమ్మకాలను అనుసరించి భర్త చనిపోయిన స్త్రీలు అనుసరించాల్సిన కొన్ని నియమాలను వెంగమాంబ ధైర్యంగా ఎదిరించి సామాజిక చైతన్యానికి బీజం వేశారు.

వెంగమాంబ యుక్తవయసు వచ్చిన దగ్గర నుంచి తిరుమల శ్రీవారిని తన భర్తగా భావిస్తుండేది. అందుకే ఆమె భర్త చనిపోయిన స్త్రీ పాటించాల్సిన నియమాలను వ్యతిరేకించారు. ఆమె దృష్టిలో సాక్షాత్తు ఆ శ్రీవేంకటేశ్వర స్వామియే ఆమె భర్త. అందుకే లోకం ఏమనుకున్నా సరే తాను ఎప్పటికీ నిత్య సుమంగళి అని ప్రకటించి, తనను తాను స్వామి వారి ప్రియురాలిగా, భార్యగా భావించి పూజలు చేసేవారు. చివరి శ్వాస వరకు శ్రీవేంకటేశ్వరునికి తన జీవితాన్ని అంకితం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News