Saturday, May 2, 2026
Homeఆరోగ్యంSweeteners | చెక్కెర బదులు ఇవి వాడుకోండి..

Sweeteners | చెక్కెర బదులు ఇవి వాడుకోండి..

  • ఏదైనా మితంగా వాడినప్పుడే ప్రయోజనం..
  • రెండు టీ స్పూన్లకంటే ఎక్కువ వాడకూడదు..

తీపి కోసం ఎక్కువ‌గా చ‌క్కెర‌పై ఆధార‌ప‌డుతూ ఉంటారు. అనేక తీపి వంట‌కాల్లో చ‌క్కెర‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. అయితే చ‌క్కెర‌పై చాలా మందికి మిశ్రమ భావనలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా, తీపి ప‌దార్థాలు తిన‌కుండా ఉండ‌లేరు. అయితే ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రుచి తగ్గకుండా ఉపయోగించుకునే సహజ ప్రత్యామ్నాయ స్వీట్‌నర్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్, పోషకాలు, రుచుల్లో తేడా కలిగి ఉన్న‌ప్ప‌టికీ భారతీయ వంటకాలలో సులభంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాలి. తెల్ల చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన స్వీట్‌నర్ వాడుతున్నప్ప‌టికి ఎక్కువగా తినొచ్చనే అర్థం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, రోజువారీ క్యాలరీలలో 10 శాతం కన్నా తక్కువ మాత్రమే చక్కెరల నుంచి రావాలి. నిపుణులు రోజుకు రెండు టీ స్పూన్లు మించకూడదని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News