Thursday, April 16, 2026
Homeనల్లగొండReservation | బీసీ మహిళలకు 50% సబ్ కోటా కేటాయించాలి

Reservation | బీసీ మహిళలకు 50% సబ్ కోటా కేటాయించాలి

  • చీకూరి లీలాగౌడ్

మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు జనాభా ప్రాతిపదికగా 50 శాతం సబ్ కోటా కేటాయించాలని బీసీ మహిళా నాయకురాలు చీకూరి లీలావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ మహిళలకు మద్దతుగా నిలవాలని కోరారు.

అప్పుడే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. బీసీ మహిళలు నారిశక్తిగా గళం విప్పి తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇప్పుడు స్పందించకపోతే మహిళా రిజర్వేషన్లలో అగ్రవర్ణాల మహిళలకే అధిక ప్రాధాన్యం దక్కే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రతి బీసీ గళం పార్లమెంట్‌కు చేరాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా “ఒక పోరాటం” స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలిగా తాను బీసీ మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని చీకూరి లీలావతి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News