Homeనల్లగొండShanampudi Saidi Reddy | ఎండుతున్న పంటలు... పట్టించుకోని ప్రభుత్వం

Shanampudi Saidi Reddy | ఎండుతున్న పంటలు… పట్టించుకోని ప్రభుత్వం

మఠంపల్లి: సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ శానంపూడి సైదిరెడ్డి(Shanampudi Saidi Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని రైతులు సాగునీరు,విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పంటలకు నీరందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.శనివారం మఠంపల్లి మండల పరిధిలోని భీల్యానాయక్‌ తండాలో మాజీ సర్పంచ్‌ కోటా నాయక్‌ ఆధ్వర్యంలో ఎండిపోతున్న పంటలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సైదిరెడ్డి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడటం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వం,అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతులకు సకాలంలో సాగునీరు అందడం లేదని ఆరోపించారు.పంటలకు నీరు ఎప్పుడు వస్తుందో, విద్యుత్‌ సరఫరా ఎలా ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారని పేర్కొన్నారు.

- Advertisement -

సాగునీటి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సాగునీటి సరఫరాకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందించాలని కోరారు.

చేతికొచ్చే దశలో ఉన్న పంటలు ఎండిపోకుండా నష్టాల బారిన పడుతున్న రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని శానంపూడి సైదిరెడ్డి డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బి వెంకట శివ,కమిటీ సభ్యులు,కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News