Homeకరీంనగర్Graduation Day | విజన్ హై స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుక

Graduation Day | విజన్ హై స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుక

కరీంనగర్ రేకుర్తి లోని విజన్ హై స్కూల్ లోనీ విజన్ కిడ్స్ లో ప్రీ ప్రైమరీ -2 విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ యూకేజీ పూర్తి చేసుకున్న చిన్నారులందరికి ఇది కేవలం గ్రాడ్యుయేషన్ కార్యక్రమం మాత్రమే కాదనీ చిన్నారుల అభివృద్ధి మరియు వారి మొదటి విజయానికి అందమైన వేడుక అని అన్నారు.

Vision High School UKG Graduation Day Celebration1

భవిష్యత్తులో చిన్నారులందరూ ఉన్నత డిగ్రీలు సాధించి గొప్ప వ్యక్తులుగా ఎదగాలని అన్నారు విద్యార్థిని విద్యార్థులందరికీ తల్లిదండ్రులతో కలిపి పట్టాలు అందజేయడం తో పాటుగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా విద్యార్థిని ,విద్యార్థులు చేసిన నృత్యాలు , సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సందవేణి వెంకట్ , ప్రిన్సిపాల్, ఇంచార్జ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News