Homeకరీంనగర్Korutla | ఒకపక్క అనారోగ్య మందులు.. మరోపక్క ‘ఆరోగ్య మందులు..!

Korutla | ఒకపక్క అనారోగ్య మందులు.. మరోపక్క ‘ఆరోగ్య మందులు..!

  • ఉదయం 4 గంటలకే పర్మిట్ రూములు మందు దొరుకుతుందా…?
  • 9 గంటలకే మద్యం విక్రయాలు.. నిబంధనలు ఎక్కడ…?
  • ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మద్యం విక్రయాల సమయాలపై నిబంధనలు ఉన్నప్పటికీ, కొన్ని పర్మిట్ రూములు తెల్లవారుజామునే తెరుచుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఉదయం వేళల్లో మద్యం విక్రయాలకు అనుమతి లేకపోయినా, కొందరు వైన్ షాప్ ల నిర్వాహకులు నిబంధనలను పక్కనపెట్టి ముందుగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉదయం 4 గంటలకే పర్మిట్ రూముల్లో మందు బాబుల సందడి..?

- Advertisement -

కోరుట్ల(Korutla) పట్టణంలో తెల్లవారుజాము 4 గంటలకే పర్మిట్ రూములు తెరుచుకుని మద్యం అందుబాటులోకి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత మాత్రమే మద్యం దొరకాల్సి ఉండగా, అంతకుముందే విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక అంగన్వాడీ టీచర్ హత్య జరిగింది. హత్య కు ముందు నిందితుడు ఒక పర్మిట్ రూములో తెలవారుజాము 5 గంటల నుండి మందు తాగి వెళ్లి హత్య చేసినట్టు పట్టణ ప్రజలు చర్చించుకున్నారు. అధికారుల జెబ్బులు నింపితే చాలు ఏమైనా చేసుకోవచ్చాటా అన్ని పట్టణ ప్రజలు గుసగుసలాడుతున్నారు.

ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ఎక్కడ…?

పట్టణంలో పర్మిట్ రూముల నిర్వహణ, మద్యం విక్రయాల సమయాలపై ఎక్సైజ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉంది. అయితే తెల్లవారుజామునే కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారా..? లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా…? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవా…?

మద్యం విక్రయాలకు ప్రభుత్వం నిర్ణయించిన సమయాలు, పర్మిట్ రూముల నిర్వహణ నిబంధనలు కచ్చితంగా అమలు కావాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలితే సంబంధిత నిర్వాహకులపై ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెల్లవారుజామున మద్యం విక్రయాలపై అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News