ఐపిఈ 2026 ఫలితాలలో తమ అద్భుతమైన విజయాన్ని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సగర్వంగా ప్రకటించింది. వాణిజ్య విద్యలో శ్రేష్ఠత పట్ల ఈ సంస్థకు ఉన్న అచంచలమైన నిబద్ధత, వివిధ బ్రాంచులలో సాధించిన అత్యుత్తమ ఫలితాలతో మరోసారి ధృవీకరించబడిందని నిర్వహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో, చైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర, 11 బ్రాంచుల ప్రధానోపాధ్యాయులతో కలిసివివరాలు వెల్లడించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా, ఐపిఈ ఫలితాల చరిత్రలో మొదటిసారిగా, మా విద్యార్థులు దాసరి నిషిక రెడ్డి ఎంఈసి రెండవ సంవత్సరం ఫలితాలలో 1000కి 992 మార్కులు సాధించారు. ఎంఈసి మొదటి సంవత్సరం ఫలితాలలో తాడి సాహితీ శివప్రియ సాయి,వెలిదండ్ల ధరణి దత్త 500కి 496 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం, రుష్దా హసన్ అన్సారీ ,బండరు చోడిత సిఈసి మొదటి ఇయర్ ఫలితాల్లో 495/500 స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారు..
ఈ సందర్భంగా, రాష్ట్ర స్థాయిలో మొదటి 5 మార్కులు సాధించిన 92 + విద్యార్థుల అసాధారణ ప్రతిభ పట్ల సంస్థ చైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర ప్రగాఢ గర్వాన్ని వ్యక్తం చేశారు. సాధించిన విజయానికి గుర్తింపుగా, ఈ సంస్థ మొత్తం రూ. 25 లక్షల స్కాలర్‌షిప్‌ను జారీ చేసింది. రాష్ట్ర స్థాయి టాపర్ లు అందరూ రూ. 10,000 నుండి రూ. 50,000 వరకు ఉన్న స్కాలర్‌షిప్ చెక్కులను అందుకున్నారు. విద్యార్థులను, వారి అద్భుతమైన విజయాలకు హృదయపూర్వకంగా అభినందించి, అచంచలమైన మద్దతు అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
