Monday, April 6, 2026
HomeజాతీయంSecurity | లియాండర్ పేస్ కు ఎక్స్ కేటగిరి భద్రత..

Security | లియాండర్ పేస్ కు ఎక్స్ కేటగిరి భద్రత..

  • త్వరలో అమల్లోకి రానున్న నిర్ణయం..

భారత టెన్నిస్ దిగ్గజం, బీజేపీ నేత లియాండర్‌ పేస్ కు ఎక్స్‌ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. త్వరలో ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. పశ్చిమబెంగాల్‌ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లియాండర్‌ పేస్‌ ఇటీవల లో చేరారు. ఈ క్రమంలో పేస్‌ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొన్నది. ఇందులోభాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించనున్నట్లు తెలుస్తున్నది.

అయితే బీజేపీలో చేరిన వారం రోజుల్లోనే కేంద్రం ఆయనకు ఎక్స్‌ కేటగిరీ భద్రత కల్పించడం గమనార్హం. కోల్‌కతాలో పుట్టిన లియాండర్‌ పేస్‌.. దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. తన కెరీర్‌లో ఏకంగా 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచారు. అందులో 10 మిక్స్‌డ్‌ డబుల్స్‌లో, 8 పురుషుల డబుల్స్‌లో నెగ్గారు. లియాండర్‌ పేస్‌ 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడు ఆయన టీఎంసీ తరఫున ప్రచారం చేశారు. ఇటీవల బీజేపీలో చేరారు. బెంగాల్‌కు రెండు దఫాలుగా ఏప్రిల్ 23, ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News