Saturday, April 4, 2026
Homeరంగారెడ్డిInspection | గ్యాస్ గోడౌన్ లలో విస్తృత తనిఖీలు..!

Inspection | గ్యాస్ గోడౌన్ లలో విస్తృత తనిఖీలు..!

  • సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలతో కదిలిన అధికారులు..
  • సిలండర్లకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు..

గ్యాస్ సిలిండర్ల విక్రయాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్, రంగారెడ్డి ఇతర జిల్లాల అధికారులకు విస్తృత తనిఖీలు నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఆ ఆదేశాల మేరకు రంగారెడ్డి జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ పి. రామకృష్ణ ఆధ్వర్యంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో పలుచోట్ల ఎల్పీజీ గోదాములు, డీలర్ల వద్ద తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

ఈ తనిఖీల సందర్భంగా ఎల్పీజీ డీలర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు ఎల్పీజీ సిలిండర్లు విక్రయించరాదని, వినియోగదారులకు సరైన తూకంతోనే సిలిండర్లు అందించవలసిందిగా కఠిన ఆదేశాలు జారీ చేశారు.

తనిఖీలలో లీగల్ మెట్రాలజీ నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం మూడు కేసులు నమోదు చేసారు. మేడ్చల్ జిల్లాలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సంజయ్ కృష్ణ తనిఖీలు నిర్వహించగా, రంగారెడ్డి జిల్లాలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ఎం. ప్రవీణ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు.

రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు ఎల్పీజీ సిలిండర్లు అమ్మిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News