Thursday, March 26, 2026
Homeనల్లగొండBorewell | నిరుపయోగంగా ఉన్న నీళ్ల చేతి పంపు బోరు.

Borewell | నిరుపయోగంగా ఉన్న నీళ్ల చేతి పంపు బోరు.

  • మూడు వార్డులకు ఉన్న బోరు,ఫలితం శూన్యం

మోత్కూరు మున్సిపాలిటీలోని అంగడి బజార్ లో ఉన్న నీళ్ల చేతి పంపు బోరు గత 15 సం.రాలుగా నిరుపయోగంగా ఉన్నదని అంగడి బజారుకు చెందిన సామాజిక కార్యకర్త అవిశేట్టి కిరణ్ కుమార్ తెలిపారు.ఆయన గురువారం ప్రకటనతో తెలిపారు.గతంలో మున్సిపల్ కమిషనర్ కు ఈ విషయం తెలియజేయడం జరిగిందని తెలిపారు.ఈ బోరు 1వ వార్డు, 8వ వార్డు, 11వ వార్డు మూడు వార్డులకు సంబంధించి ఉండడంతో ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.

ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ కె.సతీష్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనరసయ్య,వైస్ చైర్ పర్సన్ పల్లెర్ల వెంకన్న గుప్తా లు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని,బోరు వేసి,నీళ్ల ట్యాంకు నిర్మించి ఇక్కడ నీళ్ల సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News