Tuesday, March 24, 2026
Homeరంగారెడ్డిAbdullapurmet | అబ్దుల్లాపూర్ మెట్టులో ఉచిత వైద్యశిభిరం.

Abdullapurmet | అబ్దుల్లాపూర్ మెట్టులో ఉచిత వైద్యశిభిరం.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.

అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సీజనల్ మరియు వైరల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిబిరానికి వచ్చి వైద్యుల సలహాలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంతటి సుష్మ అశోక్ గౌడ్, పాలకవర్గ సభ్యులు మొగుళ్ల జీవన్ రెడ్డి, మాచగోని మహేందర్ ముధిరాజ్, గడ్డం దశరథ గౌడ్, బత్తిని నాగరాజు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News