రాత్రి సమయంలో నగునూరు గ్రామంలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్ లోని స్టోర్ రూమ్ లో ఉన్న కరెంటు కు సంబంధించిన సుమారు 60 వేల రూపాయల విలువగల కరెంటు వైర్ బండల్స్ దొంగిలించబడగా సంబంధిత యజమాని రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసిన పోలీసులు దొంగతనం చేసిన వ్యక్తుల గురించి వెతుకుచుండగా గురువారం ఉదయం తీగలగుట్టపల్లి నుండి ఆరేపల్లికి పోవు దారిలో ఎల్లమ్మ గుడి దగ్గరలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఎదురయ్యారని వారు పోలీసులను చూసి పారిపోవుటకు ప్రయత్నించగా పట్టుకొని విచారించగా నగునూరులో జరిగిన దొంగతనం గురించి ఒప్పుకొని,
దొంగిలించుకుని పోయిన కరెంటు వైర్ సామానును పక్కనే గల చెట్లలో ఒక పొదలో మట్టి కప్పి దాచి ఉంచినమని ఒప్పుకొని దొంగిలించుకుని పోయిన కరెంటు సామాగ్రిని వైర్ చుట్టలను స్వాధీనపరచుకొన్నామని రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి వెల్లడించారు నేరస్తులైన బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య అలియాస్ జంపరాజు, సూర శివాజీ మరియు సూర నవీన్ లను అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై అరెస్టు మెమో జారీ చేసినట్లు చెప్పారు.
అరెస్టు అయిన వ్యక్తులు గత కొన్ని సంవత్సరాల క్రితం మహబూబాబాద్ జిల్లా నుండి బ్రతుకుతెరువు గురించి కరీంనగర్ లోని వావిలాలపల్లి మరియు తీగలగుట్టపల్లెలోని హనుమాన్ నగర్ లో ఇల్లులు కిరాయి తీసుకొని కుటుంబంతో సహా ఉంటున్నారు కూలి పని చేసుకుంటూ త్రాగుడుకు బానిసలై సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో దొంగతనాములు చేయాలని నిర్ణయించుకొని ఇట్టి దొంగతనానికి పాల్పడ్డారనీ అన్నారు దొంగలను చకచక్యంగా పట్టుకున్న రూరల్ ఎస్ఐ లక్ష్మారెడ్డి కానిస్టేబుళ్లు సల్మాన్, అఫ్జల్ లను రూరల్ ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు
