Tuesday, February 24, 2026
Homeరంగారెడ్డిNPCI | ఉప‌కార వేత‌నాల‌కు ఎన్‌పీసీఐ పోర్టల్ తో ఆధార్ అనుసంధానం

NPCI | ఉప‌కార వేత‌నాల‌కు ఎన్‌పీసీఐ పోర్టల్ తో ఆధార్ అనుసంధానం

  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి టి.ఝాన్సీ
  • విద్యార్థుల బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబ‌ర్ సీడ్ చేయాలి
  • దరఖాస్తు చేసిన ఫారాలను ధృవీకరణ పత్రాలతో జ‌త‌ప‌రిచి ..
  • జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో స‌మ‌ర్పించాలి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌‌లు ఉపకార వేతనాల మంజూరి కొరకు (యంటిఎఫ్) ప్రభుత్వం నిధులు విడుదల చేసినదని, కావున 2025-26 విద్యా సంవత్సరమునకు దరఖాస్తుచేసుకున్న అర్హులైన బి.సి. మరియు ఇ.బి.సి. విద్యార్ధులు దరఖాస్తు చేసిన ఫారాలకు సంబందిత ధృవీకరణ పత్రాలను జతపరిచి జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించవలసినదిగా జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి టి.ఝాన్సీ రాణి కోరారు.

అలాగే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ పద్దతి కింద నమోదుచేసుకున్న విద్యార్థుల బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్‌తో సీడ్ చేయాలని మరియు సంబంధిత బ్యాంక్ లేదా NPCI పోర్టల్ అంటే www.npci.org.in ద్వారా చేయాలని జాయింట్ డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్ వారు ఆదేశించబడినదని, అందువల్ల, రాబోయే రోజుల్లో స్కాలర్షిప్ మొత్తాన్ని విడుదల చేయడానికి విద్యార్థి బ్యాంకు ఖాతా యొక్క ఆధార్ సీడింగ్ మరియు DBT యాక్టీవేష‌న్ తప్పనిసరి అని తెలిపారు.

- Advertisement -

ఈ విషయంలో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పిజి, ప్రొఫెషనల్, ఇంజనీరింగ్ మరియు ఇతర కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ మీ కళాశాల బిసి & ఇబిసి విద్యార్థులకు www.npci.org.in పోర్టల్ ద్వారా DBT కోసం వారి ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో సీడ్ చేయమని తెలియ జేయగలరని అన్నారు. విద్యార్థుల ఖాతా నంబర్‌తో ఆధార్ నంబర్‌ను సీడ్ చేయడానికి వారి బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News