జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి(Vardhanti) సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు(Tributes). రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రుల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నేతలు, వివిధ పార్టీల లీడర్లు బాపూజీని స్మరించుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించే దిశలో ఆయన అనుసరించిన సత్యం, అహింస, స్వదేశీ ఉద్యమం తదితర అంశాలను గుర్తుచేసుకున్నారు. గాంధీజీ వర్ధంతిని అమర వీరుల దినోత్సవం(Martyrs’ Day)గా కూడా పాటించారు. జాతిపిత భావజాలాన్ని, దేశానికి ఆయన అందించిన సేవలను యాదిచేసుకున్నారు. ప్రధాని మోదీ(PM Modi).. మహాత్మాగాంధీకి హృదయపూర్వక నివాళులు అర్పించారు. స్వదేశీ ప్రాధాన్యత గురించి బాపూజీ చెప్పిన విషయాలు ఇండియాని అభివృద్ధి చెందిన, స్వావలంబన గల దేశంగా నిర్మించాలనే సంకల్పానికి పునాదిగా మిగిలిపోయాయని అన్నారు. గాంధీజీ జీవితం, కృషి.. పౌరులను నిత్యం విధి నిర్వహణలో ప్రేరేపిస్తూనే ఉంటాయని ప్రధాని తెలిపారు.
Mahatma Gandhi | దేశవ్యాప్తంగా బాపూజీకి ఘన నివాళులు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
