మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం(Union Government) తాజాగా ప్రకటన చేసింది. అది అత్యంత ప్రమాదకరమైన(Most Dangerous) డ్యామ్ (Dam) అని తెలిపింది. డేంజర్ డ్యామ్స్‌కి సంబంధించి మేడిగడ్డ.. మొదటి కేటగిరీలో ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్(Parliament)లో గురువారం వెల్లడించింది. డ్యామ్‌ల సేఫ్టీపై తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఎంపీలు లక్ష్మీనారాయణ, శబరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ(Union Ministry of Jal Shakti) శాఖ రాతపూర్వకంగా జవాబు చెప్పింది. ‘దేశం మొత్తమ్మీద 50 ఏళ్లు దాటిన డ్యామ్‌ల సంఖ్య 1681. ఇందులో 6524 డ్యామ్‌లను 2025లో వానా కాలం కన్నా ముందు తనిఖీ చేశాం. వానా కాలం తర్వాత 6553 డ్యామ్‌లను చెక్ చేశాం. ఈ తనిఖీల్లో 3 డ్యామ్‌లు యమ డేంజర్ అని తేలింది. అవి.. మేడిగడ్డ, లోయర్ ఖజురి(ఉత్తరప్రదేశ్), బొకారో(జార్ఖండ్) డ్యామ్‌లు’ అని తెలిపింది. మేడిగడ్డకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సూచించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
