- పరీక్షల ముందు ప్రేరణాత్మక పందెం , ఐ వి వై విద్యార్థుల జోష్ .
“స్ట్రెస్ కి బై బై సక్సెస్ కి హాయ్ ” మార్కుల కోసం కాదు, కలల కోసం పరిగెత్తు అంటూ పరీక్షల ఒత్తిడిని దూరం చేసుకుని విద్యను ఆనందంగా స్వీకరించాలని ఉద్దేశంతో రన్ ఫర్ డ్రీమ్స్ నాట్ ఫర్ మార్క్స్ అనే నినాదంతో ఎగ్జామ్ ధాన్ 2026 ను ఆదివారం ఉదయం స్థానిక S R R కళాశాల ప్రాంగణంలో కావేరి విశ్వవిద్యాలయం నిర్వాహకులు మూడు కేటగిరీలు ప్రవేశపెట్టగా మొత్తం నాలుగు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు .విద్యార్థులు 3 K , 5 K , 10 K రేసుల్లో ఉత్సాహంగా పరిగెత్తారు. వారిలో చాలామంది తమ కష్టాన్ని ధైర్యాన్ని చూపిస్తూ గమ్యాన్ని చేరుకున్నారు. ఐ వి వై పాఠశాల వ్యవస్థాపకులు పసుల మహేష్, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారితో కలిసి పరుగులో పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఐ వి వై పాఠశాల వ్యవస్థాపకులు పసుల మహేష్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో పోటీతో పాటు స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని , పరీక్షలు కేవలం మార్కుల కోసమే కాదని వారిలో భయం , ఒత్తిడి తగ్గిస్తుందని , సహకారం క్రీడా స్ఫూర్తి పట్టుదల వంటి విలువలను పెంపొందిస్తుందని, తద్వారా తమ స్వప్నాలను సాధించే ధైర్యాన్ని కలిగిస్తుందని వారు సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి టీ షర్టు , మెడల్స్ , మరియు రిఫ్రెష్మెంట్స్ అందించారు ఐ వి వై పాఠశాల విద్యార్థులు 12 మంది విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు 3k 13 నుండి 17 వర్గం వారు ఎస్ . భవ్య శ్రీ 10 ,000 నగదు బహుమతి, వి రినీష్ 7,500, ఎం ఫణిందర్ రెడ్డి 5,000 , ఎస్ . రుత్విక 5 ,000, 8 నుండి 12 వర్గం వారికి బి . కుషాల్ 10 ,000 , వి ఐషాని 7,500 , బి . హృతిక్ 7,500 , జి . సహర్ష్ రెడ్డి 5 ,000 , తదితరులకు నగదు బహుమతి ఇచ్చి వారిని సత్కరించారు. విద్యార్థులను అభినందిస్తూ ఎగ్జామ్ ధాన్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు నిర్వహించడం ద్వారా వారిలో అభ్యసనం మెరుగుపడి వారిలో ఒత్తిడిని తగ్గిస్తుంది అని విద్యార్థులను అభినందించారు .
