Homeమెదక్‌National Voter's Day | ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఒక ఆయుధం

National Voter’s Day | ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఒక ఆయుధం

  • తహసీల్దార్ సహదేవ్

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఒక ఆయుధం లాంటిదని తహసీల్దార్ సహదేవ్ అన్నారు.ఆదివారం చిలిపిచేడ్ మండలంలోని తహసీల్దార్ సహదేవ్ ఆధ్వర్యంలో “జాతీయ ఓటర్ దినోత్సవవం” వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామంలోని వీధుల్లో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఓటు హక్కు వినియోగంపై అధికారులతో,విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ సహదేవ్ మాట్లాడుతూ…ఈ జాతీయ ఓటరు దినోత్సవాన్ని దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2011లో ప్రారంభించారు.

National Voters Day Rally in Chilipched Mandal 1

ఇక అప్పటి నుంచి ఏటా జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటామన్నారు.అయితే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సింధూజ,ఆర్ఐ సునీల్ చౌహాన్,తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది,గ్రామ సర్పంచ్ జులా అనిల్ కుమార్,ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్లు,విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News