బీహార్ సీఎం(Bihar CM) నితీష్ కుమార్(Nitish Kumar) మహిళలకు వార్నింగ్(Warning To Ladies) ఇచ్చారు. సభలో కూర్చోకుండా వెళ్లిపోతుండటంతో ‘ఈ పద్ధతేం బాగాలేదు’ అంటూ హెచ్చరించారు. మీ కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నామని, వాటి గురించి చెబుతుంటే కూర్చొని వినాలని, లేకపోతే బాగుండదు అని వాయిస్ పెంచారు. ఏకంగా సీఎమ్మే ఇలా మహిళలను బెదిరించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన సివాన్ జిల్లాలో ఇటీవల జరిగింది. సమృద్ధి యాత్రలో భాగంగా నితీష్ కుమార్ రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నారు. వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఆ వివరాలనే వెల్లడిస్తున్నారు. కానీ.. లేడీస్ అవేవీ పట్టించుకోకుండా కుర్చీల్లోంచి లేచి ఇంటి బాట పట్టడంతో ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అని సీఎం ప్రశ్నించారు. మేం చెప్పేది పెడచెవిన పెడితే మీ కోసం ప్రభుత్వం ఏం చేస్తోందో మీకెలా తెలుస్తుంది అని ప్రశ్నించారు. అయినా.. వాళ్లు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోవటం నితీష్ కుమార్‌కి ఆగ్రహం తెప్పించింది.
