మహిళా కానిస్టేబుల్(Constable), సోదరి జయశాంతి(Jayashanti)ని, వారి కుటుంబ సభ్యుల(Family Members)ను ఏపీ హోం మంత్రి అనిత(AP Home Minister Anitha) విజయవాడలోని క్యాంప్ ఆఫీసు(Vijayawada Camp Office)లో గురువారం కలిశారు. ఈ సమావేశం పట్ల అనిత సంతోషం వెలిబుచ్చారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల తనకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుందని చెప్పారు. సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేయడంతోపాటు అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు కృషి చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఫోన్‌లో అభినందించానని తెలిపారు. ఆ సమయంలో తనను కలవాలన్న ఆకాంక్షను తెలియజేయగా ఈ రోజు విజయవాడ క్యాంప్ ఆఫీసులో కలిసి జయశాంతిని సత్కరించానని(Fecilitation) పేర్కొన్నారు. మన రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.
Anitha | కానిస్టేబుల్ జయశాంతి కోరిక తీర్చిన అనిత
- Advertisement -
RELATED ARTICLES
