Homeఅంతర్జాతీయంJapan | ప్రపంచ అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం పున:ప్రారంభం

Japan | ప్రపంచ అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం పున:ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం(World’s Biggest Nuclear Plant) పునఃప్రారంభమైంది. ఫుకుషిమా విపత్తు(Fukushima Disaster) తర్వాత ఈ ప్లాంట్ ప్రారంభం కావటం ఇదే తొలిసారి. 2025 సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపు 60% మంది నివాసితులు ఈ పునఃప్రారంభాన్ని వ్యతిరేకిస్తుండగా 37 శాతం మంది మద్దతిచ్చారు. కాషివాజాకి-కరివా అణు విద్యుత్ కేంద్రం(Kashiwazaki-Kariwa plant) సామర్థ్యంపరంగా ప్రపంచంలోనే అతిపెద్దది. అయితే.. ఇందులోని 7 రియాక్టర్లలో 1 రియాక్టర్ మాత్రమే పునఃప్రారంభమైంది. 2011లో భారీ భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలోని 3 రియాక్టర్లు ధ్వంసమైన తర్వాత జపాన్ అణు విద్యుత్‌ను నిలిపివేసినప్పుడు ఇది కూడా మూతపడింది. అయితే.. ప్రస్తుతం వనరులు తక్కువగా ఉన్న జపాన్.. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, 2050 నాటికి కార్బన్ తటస్థతను సాధించడానికి, కృత్రిమ మేధస్సు నుంచి పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి అణుశక్తిని పునరుద్ధరించాలని కోరుకుంటోంది. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం షట్‌డౌన్ తర్వాత కఠిన భద్రతా నియమాల కింద పశ్చిమ, దక్షిణ జపాన్‌లోని 14 రియాక్టర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. జనవరి మధ్య నాటికి 13 రియాక్టర్లు పనిచేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News