ఈనెల 30న కీ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ వెల్లడి..
- ఈసారి 82.09 శాతం అభ్యర్థుల హాజరు..
- దరఖాస్తు చేసుకున్న 71, 670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు..
- సుప్రీం ఇచ్చిన తీర్పుతో భారీ సంఖ్యలో పోటీ..
తెలంగాణలో టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి.. జనవరి 3న ప్రారంభమైన టెట్ పరీక్షలు జనవరి 20 వరకు జరిగాయి. ఈ సందర్భంగా టెట్ కన్వీనర్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని.. జనవరి 30న టెట్ పేర్?క్షలకు సంబందించిన కీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈసారి టెట్ పరీక్షకు మొత్తం 82.09 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రకటించారు టెట్ కన్వీనర్.
టెట్ పేపర్ 1, 2లకు కలిపి మొత్తం రెండు లక్షల 38 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. 82.9 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఈసారి ఇన్ సర్వీసు టీచర్లు 71 వేల 670 మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఈసారి భారీ సంఖ్యలో పోటీ నెలకొంది. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16 తేదీల మధ్య విడుదలవుతాయని తెలుస్తోంది.
