- బతుకమ్మ పండుగ మాది అని గర్వంగా చెప్పుకోవాలి
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హస్తినాపురంలోని డీఆర్డీఎల్ కాలనీ వాసులతో కలిసి బతుకమ్మ ఆడారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత..(Kalvakuntla Kavitha) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన పండుగలను, పద్దతులను ఫ్యూచర్ జనరేషన్ కు అందించాల్సిన బాధ్యత మనదే అన్నారు.. మన పండుగలను, బతుకమ్మ పండుగను మాది అని గర్వంగా చెప్పుకోవాలి.. ముఖ్యంగా యువత బతుకమ్మ పాటలు నేర్చుకోవాలి.. ఒక్కసారి పాట నేర్చుకుంటే వందేళ్లు ఆ పాట ఉండిపోతుంది..


డీజే పాటలు ఉన్న సరే సాంప్రదాయ బతుకమ్మ పాటలను కూడా నేర్చుకోండి.. మా ఆడబిడ్డలు మంచిగా బతుకమ్మ ఆడుకోవటానికి డీఆర్డీఎల్ కాలనీలో అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కొనియాడారు.. ఇదే ఒరవడిని ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరుకుంటున్నాను అన్నారు.. పండుగలకు పార్టీలు, రాజకీయాలు ఉండవు. ఇదే విధంగా మన సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

