Thursday, March 5, 2026
HomeతెలంగాణBandi Sanjay | మా మత విశ్వాలతో ఆడుకోవద్దు..

Bandi Sanjay | మా మత విశ్వాలతో ఆడుకోవద్దు..

ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌..

  • పురానాపూల్‌ ఆలయంలో విధ్వంసంపై బీజేపీ ఆగ్రహం..
  • ఇవి విడిగా జరిగిన సంఘటనలు కావు.. పథకం ప్రకారం జరుగుతున్న దాడులు..
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌..
  • ఎక్స్‌ వేదికగా నిప్పులు చెరిగిన బండి సంజయ్‌..

హైదరాబాద్‌లోని పాతబస్తీ పురానాపూల్‌ ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన విధ్వంసంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ విశ్వాసాలతో ఆడుకోవద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం మౌనం వహించడాన్ని తప్పుబడుతూ, రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్ణ వేదికగా స్పందించారు. ‘‘ముందు సఫిల్‌గూడ, ఇప్పుడు పురానాపూల్‌. ఇంకా ఎన్ని ఆలయాలు? కట్టమైసమ్మ ఆలయంపై దాడి జరిగిన మరుసటి రోజే పాతబస్తీలో హిందూ ఆలయాన్ని అపవిత్రం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మౌనంగా ఉంది, అస దుద్దీన్‌ ఒవైసీ దీనికి ప్రాధాన్యత లేదంటూ సంఫ్‌ును నిందిస్తు న్నారు.

- Advertisement -

దొంగే.. పోలీసును దండిరచినట్లు ఉంది వీరి తీరు’’ అని బండి సంజయ్‌ విమర్శించారు. శాంతిభద్రతలు క్షీణించాయని, బుజ్జగింపు రాజకీయాలే రాజ్యమేలుతున్నాయని ఆయన మండి పడ్డారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు పురానాపూల్‌ ఆలయాన్నిసందర్శించారు. ఇదివిడిగా జరిగిన ఘటన కాదని, తెలంగాణలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో భాగమని అన్నారు. శ్రీశైలం వెళుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ బస చేసిన చారిత్రక ప్రదేశంలో ఇలాంటి దాడి జర గడం ఒక పెద్ద కుట్రలో భాగమని ఆరోపించారు.

మూడు రోజుల క్రితం సఫిల్‌గూడ ముత్యాలమ్మ ఆలయం, అంతకు ముందు కీసర హనుమాన్‌ ఆలయంపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రాజా సింగ్‌ కూడా ఆలయాన్ని సందర్శించి ఘటనను తీవ్రంగా ఖండిరచారు. ఈదాడి మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బ తీసిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుని, మతపరమైన ప్రదేశాలకు పూర్తి భద్రత కల్పిం చాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News