హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలలో పర్వతగిరి మండలం రోళ్లకల్ గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు జనగం రాజా గౌడ్ ప్రతిభ చాటారు. రోళ్లకల్ గ్రామ మాజీ సర్పంచ్ జనగం సమ్మయ్య గారి కుమారుడైన రాజా గౌడ్, తెలంగాణ స్పెషల్ పోలీస్ తరఫున రెస్లింగ్ ఫ్రీ స్టైల్ 98+ కేటగిరి విభాగంలో పోటీ పడి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలలో పతకం సాధించడం ద్వారా తన గ్రామానికి, మండలానికి మంచి గుర్తింపు తీసుకువచ్చిన రాజా గౌడ్‌ను గ్రామ ప్రజలు, క్రీడాభిమానులు మరియు పలువురు ప్రముఖులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
