Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిPrajavani | కిష్టాపూర్ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు

Prajavani | కిష్టాపూర్ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు

  • మాజి కౌన్సిలర్ గణేష్

జిహెచ్ఎంసి పరిధిలోని మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పలు సమస్యలపై డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు వినతి అందాయి. పూడూర్ కిష్టాపూర్ సర్కిల్ పరిధిలోని కిష్టాపూర్ లో పలు సమస్యలపై స్థానిక నాయకులు వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు మేడ్చల్ సర్కిల్ కు నూతన డిప్యూటీ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన సుధాంష్ ను శాలువాతో సన్మానించారు. అనంతరం కిష్టాపూర్ లోని డబుల్ బెడ్ రూం ఇళ్లు నిరూపయోగంగా ఉన్నాయని, డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో కొందరు వ్యక్తులు అసాంఘీక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు.

కిష్టాపూర్ లో చాలా మంది ఇళ్లు సరిపడ లేక కిరాయి ఉండడం, ఇబ్బందులు పడడం వంటివి జరుగుతున్నాయని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ను అర్హులైన నిరుపేదలకు అందేలా చూడాలని కోరారు. కిష్టాపూర్ లోని సర్వే నెంబర్ 557,708,786 లలో గల ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని , వాటిని ఆపి ప్రభుత్వ భూమిని కాపాడాలని తెలిపారు. ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చిన వారిలో 4వ వార్డు మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగరాజు, దగ్గు పవన్, మంత్రి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News