Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిVillage Development | గ్రామ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి

Village Development | గ్రామ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి

  • సర్పంచ్ k.విజయ కుమార్

పదవులు అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, ప్రజాసేవకు అప్పగించిన బాధ్యత అని నిరూపిస్తున్నారు బండరావిరాల గ్రామ నూతన సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండే గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్, రోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు “వార్డు యాత్ర” పేరుతో ప్రతి వార్డును సందర్శిస్తున్నారు. గురువారము ఉదయం 1వ, 2వ వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు . ప్రజల నుండి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే, మార్పు బండరావిరాల గడప నుండే మొదలైందని అర్థమవుతోంది.

సమస్య ఏదైనా, పరిష్కారం కోసం ప్రజల వద్దకే వెళ్తున్న సర్పంచ్ చొరవ అభినందనీయం. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దూస శంకర్,వార్డు సభ్యులు గుండ్ల భవాని – శివ, నేమురగోముల మహేశ్, ఏర్పుల హరికృష్ణ, కోదాసు మణెమ్మ ఆంజనేయులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News