దేవుడు(God) మానవ జాతి పాపాలను(Sins) తొలగించడానికి మనిషి రూపం(Human Form)లో వచ్చాడనే నమ్మకం(Trust)తో క్రిస్మస్ జరుపుకోవాలని, అదే ఈ పండుగ(Festival) ఉద్దేశమనే వాదన ఉంది. క్రిస్మస్ నిర్వహణలో కొన్ని పాత, కొత్త పద్ధతులను అనుసరిస్తారు. కొన్ని లౌకిక పద్ధతులనూ పాటిస్తారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బహుమతులు (Gifts) ఇస్తారు. గ్రీన్ ఆకులతో రింగ్ తయారుచేస్తారు. కొవ్వొత్తులను(Candles) వెలిగిస్తారు. సంగీతంతో కూడిన గీతాల ఆలాపన, క్రీస్తు జననానికి సంబంధించిన ప్రార్థనలు(Prayers), చర్చిలకు అలంకరణలు(church Decorations) వంటివి చేస్తారు.
శాంతాక్లాజ్ తదితర పాత్రధారులు పిల్లలకు బహుమతులు ఇస్తారు. వివిధ సంస్కృతలతో కూడిన జానపద కథల్లో క్రిస్మస్ భాగమైంది. క్రీస్తు(Christ) చెప్పిన క్షమా గుణం, ప్రేమ, పరిశుద్ధ మానవతావాదం, పగవాణ్ని కూడా ప్రేమించేతత్వం విస్తృతమవ్వాలి. నేటి ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఏసు ప్రభువు బోధనలు(Teachings), సందేశం(Message) అనుసరణీయం.
- ఉమా శేషారావు
