Thursday, February 12, 2026
Homeఆరోగ్యంHealth Benefits | ఆరోగ్యానికి త్రిఫల చూర్ణం ఉపయోగాలు

Health Benefits | ఆరోగ్యానికి త్రిఫల చూర్ణం ఉపయోగాలు

త్రిఫల చూర్ణం(Triphala Powder) ఉపయోగాల గురించి ఒక ముక్కలో చెప్పాలంటే.. ఈ చూర్ణాన్ని నిత్యం తీసుకుంటే డాక్టర్‌తో పని ఉండదు (No Need To Consult Doctor). మనిషి ఆరోగ్యం(Man’s Health) వాత, పిత్త, కఫ లక్షణాల హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. ఈ హెచ్చుతగ్గులను సమతూకం చేసే తిరుగులేని ఔషధమే(Medicine) త్రిఫల చూర్ణం. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమం.. త్రిఫల చూర్ణం. ఇందులో ఒక భాగం కరక్కాయ, రెండు భాగాలు తానికాయ, నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి.

కొంత మంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు. మార్కెట్‌(Market)లోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహా చూర్ణం చేసి అమ్ముతున్నారు. విత్తనాలు కాకుండా పైపెచ్చులతో చేసిన త్రిఫల చూర్ణం ప్రభావవంతమైంది. ఇది సమస్త రోగాలను(All Diseases) తగ్గించే అద్భుతమైన శక్తి గలది. జబ్బులున్నా లేకపోయినా ఒక నెల పాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్‌గా వాడి మీ శరీరాన్ని గమనించండి. మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.

- Advertisement -

అంతేకాదు.. త్రిఫల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది. అలాగే.. త్రిఫల చూర్ణం కంటిచూపును పెంచుతుంది. జీర్ణశక్తి,ని, ఆకలిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వాతం నొప్పులు నయమవుతాయి. చర్మ సమస్యలను, లివర్, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉపయోగించే విధానం.. ఉదయాన్నే పరిగడుపున అర గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చెంచా త్రిఫల చూర్ణం వేసుకొని తాగాలి. అదే విధంగా రాత్రి పడుకునే ముందు కూడా తాగాలి.

  • వైద్య శేషారావు
- Advertisement -
RELATED ARTICLES

Latest News