Wednesday, February 25, 2026
Homeక్రైమ్ వార్తలుLok Adalat | లక్షకు పైగా కేసుల పరిష్కారం

Lok Adalat | లక్షకు పైగా కేసుల పరిష్కారం

తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో తాజాగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌(National Lok Adalat)లో లక్షకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. సెటిల్‌మెంట్‌(Settlement)కి అర్హత ఉన్న కేసులను గుర్తించి ఇరు వర్గాలకు నోటీసులు ఇవ్వటం (Notice Issue) ద్వారా వారిని ఒక చోటకు చేర్చి రాజీ కుదిర్చారు. డిసెంబర్ 11న ప్రారంభమై 21న ముగిసిన ఈ ప్రక్రియలో మొత్తం లక్షా 5 వేల 182 కేసులు సెటిల్ అయ్యాయి. డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొన్న సంగతి తెలిసిందే.

రెండు వర్గాల మధ్య కేసులను సామరస్యంగా పరిష్కరించుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన విజయాన్ని సాధించింది. విస్తృత శ్రేణి చట్టపరమైన వివాదాలను పరిష్కరించారు. సైబర్ మోసాల బాధితులకు (Victims Of Cyber Fraud) ఆర్థిక ఉపశమనం కలిగించారు. 215 విపత్తు నిర్వహణ కేసులు, 55497 ఇ-పెట్టీ కేసులు, 31599 మోటార్ వాహనాల చట్టం కింద నమోదైన కేసులు పరిష్కారమయ్యాయి. 3763 సైబర్ క్రైమ్ కేసుల్లో దాదాపు రూ.19.50 కోట్లను బాధితులకు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News