Thursday, February 12, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐSarpanch | విదేశాల నుంచి వచ్చి విజయం

Sarpanch | విదేశాల నుంచి వచ్చి విజయం

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన పంచిత ధర్మరాజు యాదవ్(Panchita Dharmaraju Yadav) అరుదైన ఘనత సాధించారు. ఖతర్ నుంచి వచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) బరిలో నిలిచి గెలిచారు. అది కూడా ఒక్క ఓటుతో నెగ్గటం విశేషం. సర్పంచ్ ఎలక్షన్లలో (Sarpanch Elections) ఇలాంటి సక్సెస్ కొట్టడం పలువురిని ఆకట్టుకుంటోంది. ధర్మరాజు ఖతర్‌(Qatar)లో 16 ఏళ్లకు పైగా పనిచేశారు. అక్కడి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samiti) ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

ఏడాది కిందట సొంతూరుకి వచ్చి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పోటీ చేసి, తన లక్ష్యాన్ని గ్రామ ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, సామాజికంగా, ఆర్థికంగా బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించటం చెప్పుకోదగ్గ విషయం. ప్రజలు తెలివికలిగినవాళ్లని, అభివృద్ధి ఎజెండా(Development Agenda)కు ఓటేశారని ధర్మరాజు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News