కరీంనగర్ లోని కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు పెంచి వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు మానసికంగా గురిచేస్తున్నాయని, సకాలంలో ఫీజు చెల్లించని విద్యార్థులను బయట కూర్చో పెడుతున్నారని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆల్ఫోర్స్ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ డిమాండ్ చేశారు. అల్ఫోర్స్, మానేరు, పారామిత,సిద్దార్థ ఎస్ వి జె సి విద్యాసంస్థలు జాన్షన్ గ్లోబల్ కోర,లాంటి స్కూల్స్ భారీగా పీజులు వసూల్ చేస్తున్నాయని అయన ఆరోపించారు.
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిఓడిపోవడంతో ఎన్నికల్లో అయిన ఖర్చును భర్తీ చేసుకోవడానికి భారీగా ఫీజులరేట్ పెంచి విద్యార్థులను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని అయన ఆరోపించారు. భారీగా ఫీజులు చెల్లించ లేమని విద్యార్థుల తల్లితండ్రులు అల్ పోర్సు అధినేతను కలవడానికివెళ్తే సార్ మీటింగ్ లో వున్నాడని కలవడానికి ఇప్పుడు వీలు లేదంటూ సమయం ఇవ్వడనే ప్రచారం కూడ ఉందన్నారు. అల్పోర్సు, సిద్దార్థ, పారామిత తదితర లాంటి స్కూల్స్ యాజమాన్యం పేరెంట్స్ కు అవకాశం ఇవ్వకుండా సిబ్బంది కి ఆదేశాలు ఇవ్వడం తో వారు సిబ్బంది వరకే పేరెంట్స్ ను పరిమితం చేసి ఇష్టాను సారంగా దోచుకుంటున్నారని విమర్శించారు.
అల్ఫోర్స్ లో గురువారం నుండి ప్రారంభమైన ఆఫ్ ఇయర్లీ పరీక్షలకు ఫీజులు కట్టలేదని భగత్ నగర్ తో పాటు అన్ని ఆల్ఫోర్స్ పాఠశాలలోని విద్యార్థులను ఫీజులు కట్టలేదని నేపథంతో తరగతి గది నుంచి బయటకు కూర్చోబెట్టి పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులను వేధిస్తున్నారన్నారు. ధీంతో విద్యార్థులు మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఖర్చును భర్తీ చేసుకోవడానికి పాఠశాలల ఫీజులు పెంచి బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారు. తక్షణమే పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకొని పరీక్షలు రాయని విద్యార్థులకు న్యాయం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరుచు తక్షణమే చర్య తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ డిమాండ్ చేశారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రెయివేట్ పాఠశాల ల పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు
