Sunday, February 22, 2026
Homeమెదక్‌Accident | బైకును ఢీకొన్న వాహనం

Accident | బైకును ఢీకొన్న వాహనం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

మెదక్ జిల్లా(Medak District)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట హైవే(Peddashankarampeta highway)పై వెళ్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి వివరాలు.. కూర్మ లింగయ్య(45), సాయవ్వ(40), సాయిలు(18), మానస(8). మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందినవారిగా చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat Elections) ఓటు (Vote) వేసేందుకు హైదరాబాద్ (Hyderabad) నుంచి స్వగ్రానికి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. దీంతో.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. గతంలోనూ పెద్దశంకరంపేటలో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు ఆందోళన వెలిబుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News