Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌OU | ప్రపంచ నిర్మాణంలో ఓయూ విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలి

OU | ప్రపంచ నిర్మాణంలో ఓయూ విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలి

  • ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసిన ప్రజా పాలన మాది- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం
  • తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ-
  • అత్యాధునిక సౌకర్యాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం
  • 1000 కోట్ల నిధులతో చేపట్టబోయే నిర్మాణాల అభివృద్ధి పై పవర్ ప్రజెంటేషన్ వెల్లడించిన పలు సంస్థలు
  • గొప్ప వ్యక్తులను అందించిన ఘనత చరిత్ర కలిగిన విద్యాలయం ఓయూ

తెలంగాణ విద్యా ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర మార్పు కోసం ₹1000 కోట్ల నిధి మంజూరు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉస్మానియా విద్యార్థులలే ప్రపంచాస్ని నడిపేలా ఎదగాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.వేలాది మందివిద్యార్థులు,అధ్యాపకులు,ఉద్యోగులతో కిక్కిరిసిన ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు.తాను ఇచ్చిన మాట ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ గడ్డపై అడుగు పెట్టానని స్పష్టం చేశారు.గ్రామీణ ప్రాంతం నుంచి,అత్యంత వెనకబడిన ప్రాంతాం నుంచి వచ్చిన వ్యక్తిగా పేదరికరం,పేదల ఎదుగుదలకు ఏం చేయాలనే విషయమై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్న ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు డబ్బుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నానని అన్నారు.

డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారని,మన పిల్లలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధునాతన,నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసించాలన్నదే తన అభిమతమని పునరుద్ఘాటించారు.అందుకే రూ.1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించామని వెల్లడించారు.ఉస్మానియా విశ్వవిద్యాయానికి వెళ్తుంటే తనకు కొంతమంది ఎందుకు ధైర్యం చేస్తున్నావని అడిగారని,ఓయూకు వెళ్లాలంటే ధైర్యం అవసరం లేదని గుండెల నిండా నింపుకున్న అభిమానం ఉంటే చాలని గుర్తు చేశారు.తెలంగాణ గడ్డకు ఓ చైతన్యం,పౌరుషం ఉందని ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైన విషయాన్ని వివరించారు.

- Advertisement -

పీవీ నర్సింహా రావు,జైపాల్ రెడ్డి,జార్జ్ రెడ్డి,గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో మరింత మంది దేశానికి,ప్రపంచాన్ని నడిపే నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు.తనకు విదేశీ భాష రాకపోయినా పేదవాడి మనసు తెలిసిన వాడిగా పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానన్నారు.ఆస్తులు, భూములు లేకపోవటం వెనకబాటుతనం కాదని చదువు లేకపోవటం వెనుకబాటు తనమని గుర్తు చేశారు.విద్య ఒక్కటే అభివృద్ధికి,వెనకబాటు తనం నిర్మూలనకు ఉపయోగపడుతుందని గుర్తు చేశారు.

యూనివర్శిటీల్లో బోధన,బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కమిటీని నియమించామన్నారు.అందులో ప్రభుత్వం తలదూర్చదని స్పష్టం చేశారు.ఎలాంటి పైరవీలకు తావులేకుండా ఉద్యోగ నియామకాలు జరగాలని ఆకాంక్షించారు.ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయగా అభివర్ణించిన ముఖ్యమంత్రి ఓయూను కాపాడుకోవాలన్నారు.పిల్లల భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్ మెంట్ ఉన్న వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వీసీల కు దిశానిర్దేశం చేశారు.విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా నిబద్ధతతో నిరంతరం కష్టపడి ఫలితం సాధించాలని హితవు పలికారు.

అంతకు ముందు ప్రారంభోపన్యాసం చేసిన ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ వెయ్యికోట్ల నిధులతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణలోని ‘T’ అక్షరం ‘ట్రస్ట్'(విశ్వాసం)ను సూచిస్తుందని,ఇది ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ సమ్మిట్’లో లక్షల కోట్ల పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించడానికి దోహదపడిన విషయాన్ని గుర్తు చేశారు.

టి అక్షరం తెలంగాణలోని విద్యాభివృద్ధికి కూడా చిహ్నమని అన్నారు.తెలంగాణ అన్ని స్థాయిలలో విద్యలో తిరుగులేని నంబర్ వన్ రాష్ట్రంగా మారడానికి వేగవంతమైన మార్గంలో ఉందని ఆయన అభివర్ణించారు.రానున్న చరిత్రలో ముఖ్యమంత్రి సభ ఓ చారిత్రక సందర్భంగా నిలిచిపోతుందన్న ప్రొఫెసర్ కుమార్,ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుందని అన్నారు. అంతకు ముందు స్వాగతోపన్యాసం చేసిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ,ముఖ్యమంత్రి ప్రభుత్వరంగంలో విద్యాభివృద్ధి పట్ల అపారమైన ప్రేమ ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి గారి రాకతో ఓయూలోని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి రాకకు ముందే ఓయూ అభివృద్ధిపై పలు కన్సల్టెన్సీలు పలు అభివృద్ధి నమూనాలను ఆవిష్కరించారు.ARCOP PVT LTD, MA Architects Pvt Ltd,SKIL అండ్ అసోసియేట్స్ బై హార్ట్‌ఫుల్‌నెస్ ప్రతినిధులతో సహా,భవిష్యత్తు కోసం అద్భుతమైన,వివరణాత్మక బ్లూప్రింట్‌ను సమర్పించారు.ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.కొత్త అకడమిక్ బ్లాక్,పరిశోధన మరియు అభివృద్ధి బ్లాక్,కొత్త బాలుర మరియు బాలికల హాస్టళ్లు,బహుళార్ధసాధక క్రీడా కేంద్రం,సమీకృత గ్రంథాలయం,కొత్త ఆరోగ్య కేంద్రం,జీవ వైవిధ్య ఉద్యానవనం,కన్వెన్షన్ సెంటర్, మరియు సైకిల్ ట్రాక్‌లు,పాదచారుల నడక మార్గాలతో కూడిన విస్తృత రహదారి నెట్‌వర్క్ ను విజువల్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.

ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్యమంత్రి సలహాదారు కె.కేశవ రావు,మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండ రామ్,ఎ.వి.ఎన్. రెడ్డి,అద్దంకి దయాకర్,హైదరాబాద్ మేయర్ జి.విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ ఎం.శ్రీలత శోభన్ రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి,కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. దేవసేన ఐఏఎస్,ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి,వీసీ ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్,యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ బి.లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News