Wednesday, February 11, 2026
HomeరాజకీయంNarsimha | అందరి నోటా ఒకటే మాట.. ‘అంతటి’దే గెలుపు బాట..

Narsimha | అందరి నోటా ఒకటే మాట.. ‘అంతటి’దే గెలుపు బాట..

ప్రభుత్వ ఉద్యోగం కన్నా.. ప్రజాసేవ మిన్న..
పుట్టి పెరిగిన ఊరు కోసం.. పోస్ట్ మాస్టర్ కొలువు త్యాగం..
సర్పంచ్ అభ్యర్థి అంతటి నర్సింహ గౌడ్ ఆదర్శం
వెలిమినేడు గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ముందంజ

తన కోసం కాదు.. మన కోసం అనే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అంతటి నర్సింహ గౌడ్. ఉన్న ఊరు వెలిమినేడు(Veliminedu)ను కన్న తల్లిలా, సొంత కుటుంబంలా భావించారు. గ్రామంలోని ప్రతిఒక్కరూ తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అనుకున్నారు. వాళ్లకు ఏ సమస్యా ఉండకూడదని, రాకూడదని పెద్ద మనసుతో ఆలోచించారు. పరిష్కారం కోసం 30 ఏళ్లుగా నిత్యం పరితపిస్తున్నారు. తోటి వారి కోసం శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నారు. విద్యార్థులు, నిరుపేదలు, రైతులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల కోసం అహర్నిశలు పోరాడుతున్నారు. అనేక విధాలుగా సహాయ సహకారాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

చేతిలో ఏ పదవీ లేకుండానే ఇంత చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అండ ఉంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ(Public Service)లో నిమగ్నం కావొచ్చని, పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాట పట్టించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఆశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat Elections).. సర్పంచ్ (Sarpanch) పదవి బరిలో నిలిచారు. తన ఆశయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వ పోస్ట్ మాస్టర్ (Post Master) ఉద్యోగాన్ని కూడా వదులుకుంటున్నారు. తద్వారా.. మిగతా పోటీదారులతో పోల్చితే ఎంతో ఉన్నతమైన నిర్ణయం తీసుకున్నారు. తన పల్లె ప్రజల మనసు గెలుచుకుంటున్నారు.

అంతటి నర్సింహ గౌడ్‌కు ప్రజల్లో మంచిపేరుతోపాటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, పాలకులతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి తన ఊరుకి పెద్దఎత్తున నిధులను, సకల సౌకర్యాలను తీసుకురాగల సామర్థ్యం ఆయన సొంతం. మండల, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులను, అధికారులను అందర్నీ ఒప్పించి, గ్రామ ప్రజలను మెప్పించేలా సుపరిపాలన అందించగల లౌక్యం, చాకచక్యం అంతటి నర్సింహ గౌడ్‌కు అదనపు అర్హతలని చెప్పొచ్చు.

ఎన్నికల్లోని తన ప్రత్యర్థుల మాదిరిగా తాను పొలిటికల్ టూరిస్ట్‌(Political Tourist)ను కాదని చెబుతున్నారు. ‘సంవత్సరంలో 365 రోజులు, రోజులో 24 గంటలు మీ ముందే, మీ కోసమే అందుబాటులో ఉంటానని నిజాయితీగా, నిబద్ధతతో హామీ ఇస్తున్నాను’ అన్నారు. సాటి వారి కోసం సాధారణ జీవితం గడుపుతున్న తనను ప్రజలు పెద్ద మనసుతో ఆదరించి ఆశీర్వదించాలని అంతటి నర్సింహ గౌడ్ కోరుతున్నారు. ఉంగరం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలోని ప్రజలందరూ సర్కారువారి సంక్షేమ పథకాల ఫలాలు పొందాలని, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

ప్రతి కాలనీ, ప్రతి బజారు అభివృద్ధి చెంది ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, అదే తన లక్ష్యమని వివరిస్తున్నారు. తనను గెలిపిస్తే వెలిమినేడు ఊరు రూపురేఖలను ఏవిధంగా మార్చబోతున్నాడో అక్షరాలా కరపత్రాల రూపంలో కళ్ల ముందు ఉంచారు. నేను మీకు నాయకుణ్ని కాదు.. మీ సేవకుణ్ని అని వినమ్రంగా విన్నవిస్తున్నారు. ఆశ కోసం కాదు.. ఆశయం కోసం వస్తున్నా అని పిలుపునిస్తున్నారు. అంతటి నర్సింహ గౌడ్‌ ఏ శుభసమయాన ఈ సంకల్పం తీసుకున్నారో గానీ.. ఆయన విజయం నల్లేరుపై నడకే అని స్థానికులు ముక్తకంఠంతో అంటున్నారు. అంతటి నర్సింహ గౌడ్‌నే గెలిపించుకుంటామని వెలిమినేడు గ్రామ ప్రజలు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News