Thursday, March 26, 2026
Homeరంగారెడ్డిఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం..

ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం..

  • శరణు ఘోషతో మార్మోగిన అలియాబాద్ గ్రామం..
  • మొదటిసారి గ్రామస్తులంతా కలిసి ఏర్పాటు చేసిన మహా పడిపూజ..
  • అయ్యప్ప మాలధారణ భక్తులతో పాటు పాల్గొన్న సాధారణ భక్తులు..
  • భక్తి కీర్తనలతో ప్రత్యేక పూజలు చేసిన వైనం..
  • అయ్యప్ప స్వామి పూజకు విరాళం అందించిన భక్తులకు ఘనంగా సన్మానం..

“శరణ్యాయ హరిహరసుతాయ స్వామినే పదద్వంద్వయుగే నిత్యం నమో ధర్మశాస్త్రయే। కలౌ యుగే క్షేమకరాయ విఘ్నహర్త్రే
స్వామి శరణం అయ్యప్పా!”

అంటే హరిహరసుతుడైన అయ్యప్ప స్వామికి నేను శరణాగతుడను. అయ్యప్ప స్వామి యొక్క దివ్య పాదయుగాలకు నేను ఎల్లప్పుడూ వందనం చేస్తున్నాను. కలియుగంలో భక్తులకు క్షేమాన్ని అందించే, విఘ్నాలను తొలగించే ధర్మశాస్త్రునికి నా నమస్కారాలు. “స్వామి శరణం అయ్యప్పా” అని హృదయపూర్వకంగా శరణం కోరుతున్నాను. అని అర్ధం.. అయ్యప్ప స్వామి పడిపూజకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది.. అలాంటి పడిపూజలు భక్తులు విరివిగా చేపడుతుండటం ముదావహం.. ఇదే కోవలో అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు..

- Advertisement -

హరిహర సుతుడు అయ్యప్ప మహా పడిపూజ మంగళవారం అలియాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్వహించారు సత్యం గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు.. ఈ యొక్క అయ్యప్ప స్వామి మహా పడి పూజకు చుట్టు పక్క గ్రామాల్లో ఉన్న అయ్యప్ప మాలధారణ స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అనంతరం అయ్యప్ప మాల వేసుకొని అలియాబాద్ గ్రామం నుండి శబరిమలకు పాదయాత్రగా వెళ్లి ముక్కు తీర్చుకున్న చీర్ల తరుణ్ స్వామికి ఘానా సన్మానం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులే కాకుండా గ్రామ ప్రజలు, రాజకీయ పార్టల నేతలు పాల్గొని అయ్యప్ప స్వామి తీర్ద ప్రసాదాలు స్వీకరించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News